ఒక్క పోస్ట్.. భారత క్రికెట్‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. ధోనీ వీడ్కోలుకు ఆరేళ్లు!
- ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆరేళ్లు పూర్తి
- 2020 ఆగస్ట్ 15న రాత్రి 7:29కి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన
- మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చారిత్రక రికార్డు
- ఐపీఎల్‌లో చెన్నైకి 5 టైటిళ్లు అందించిన ఎంఎస్‌డీ
- ప్రపంచ క్రికెట్‌లో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ధోనీ వారసత్వం
భారత క్రికెట్ చరిత్రలో అదొక మరపురాని రోజు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ, ఒక శకం ముగిసింది. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2020 ఆగస్ట్ 15న రాత్రి 7:29 గంటలకు.. భారత క్రికెట్‌ను శాసించిన, అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ తన 15 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఎలాంటి మీడియా సమావేశం లేదు, సుదీర్ఘ ప్రసంగాలు లేవు, ఆర్భాటాలు అసలే లేవు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో అత్యంత నిశ్శబ్దంగా ధోనీ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, తన క్రికెట్ ప్రయాణంలోని మధురమైన చిత్రాలతో కూడిన ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియో నేపథ్యంలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హూన్' అనే ముకేశ్ పాట, అతని వీడ్కోలు భావనకు అద్దం పట్టింది. "ఇన్నాళ్లు మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఈ రోజు రాత్రి 7:29 గంటల నుంచి నన్ను రిటైర్ అయిన వ్యక్తిగా పరిగణించండి" అని క్లుప్తంగా రాసుకొచ్చాడు. అంతే.. ఒక్క పోస్ట్‌తో భారత క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం ముగిసిపోయింది. నాయకత్వానికి కొత్త అర్థం చెప్పిన, ఒత్తిడిలో మ్యాచ్‌లను ముగించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఒక గొప్ప యోధుడు మైదానం నుంచి అలా నిష్క్రమించాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోనీ, ఆ తర్వాత చరిత్ర సృష్టించాడు. మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన ప్రపంచంలోని ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను యువ జట్టుతో గెలిచి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 2011లో వాంఖడే స్టేడియంలో సిక్సర్‌తో వన్డే ప్రపంచకప్‌ను అందించి భారతీయుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో అతని కెప్టెన్సీ ప్రస్థానం పరిపూర్ణమైంది.
ఆటగాడిగానూ ధోనీ గణాంకాలు అద్భుతం. 350 వన్డేల్లో 10,773 పరుగులు, 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేశాడు. 98 టీ20 మ్యాచ్‌లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వికెట్ల వెనుక అతడి చురుకుదనానికి 829 అంతర్జాతీయ డిస్మిసల్స్ నిదర్శనం. ప్రపంచంలోని గొప్ప వికెట్ కీపర్-బ్యాటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే మహీ చివరి అంతర్జాతీయ మ్యాచ్.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, క్రికెట్‌కు మాత్రం దూరం కాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు నాయకుడిగా కొనసాగుతూ, ఆ జట్టుకు ఐదుసార్లు టైటిల్స్ అందించాడు. 2023లో కూడా సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలబెట్టడం ధోనీ నాయకత్వ పటిమకు నిదర్శనం.
ధోనీ వారసత్వం కేవలం ట్రోఫీలు, పరుగులకు మాత్రమే పరిమితం కాదు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం అతని ప్రత్యేకత. అందుకే అభిమానులు ముద్దుగా 'కెప్టెన్ కూల్' అని పిలుచుకుంటారు. ఆరేళ్లు గడిచినా, ఇప్పటికీ ఆగస్ట్ 15న రాత్రి 7:29 గంటలు అయిందంటే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో మహీ జ్ఞాపకాలు మెదులుతూనే ఉంటాయి.