వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి వంటి వారు దొరకరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంస
- సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రశంసల వర్షం
- వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నేత దొరకరని వ్యాఖ్య
- రాహుల్ గాంధీ రాముడైతే, జగ్గారెడ్డి హనుమంతుడన్న ముఖ్యమంత్రి
- నాయకులకు మార్కులు వేస్తే నాకంటే జగ్గారెడ్డికే ఎక్కువొస్తాయని వెల్లడి
- ఆయన్ను ఓడించడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమంటూ వ్యాఖ్య
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకరని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడు అనుకుంటే, జగ్గారెడ్డి ఆయనకు హనుమంతుడి వంటి వారని అభివర్ణించారు. "నాయకులకు మార్కులు వేస్తే నాకంటే జగ్గారెడ్డికే ఎక్కువ వస్తాయి. అలాంటి నాయకుడిని ఓడించడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం" అని సంగారెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. "కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు ఆయన. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్న, జగ్గారెడ్డి కచ్చితంగా ప్రజా జీవితంలోనే ఉండాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.