Advertisement

శనివారం పనిచేయను అన్నాడు.. జాబ్ ఇచ్చాక.. యజమానిని మెప్పించిన జెన్ జీ

Offbeat
Advertisement
  • శనివారం పనిచేయనన్న యువకుడికి ఉద్యోగం ఇచ్చిన ఢిల్లీ వ్యాపారి
  • ఆఫీసు బయట వ్యక్తిగత జీవితం ముఖ్యమన్న యువకుడు
  • అతడి నిజాయతీ, స్పష్టతకు ముగ్ధుడైన కంపెనీ యజమాని
  • రెండు త్రైమాసికాల్లో టీమ్‌లోనే టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచిన ఉద్యోగి
ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త తన సంస్థలో ఎదురైన ఆసక్తికర అనుభవాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. శనివారాల్లో పనిచేయడానికి నిరాకరించిన ఓ 25 ఏళ్ల యువకుడికి ఉద్యోగం కల్పించగా, అతడు తన బృందంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిషేక్ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త తన కంపెనీలోని సేల్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక యువకుడు తాను శనివారాల్లో పని చేయలేనని స్పష్టంగా తెలిపాడు.

"ఈ వయసులో ఇలా నిరాకరించడం సోమరితనం కాదా?" అని అభిషేక్ ప్రశ్నించగా, ఆ యువకుడు ఏమాత్రం తడుముకోకుండా "సర్, ఆఫీస్ వెలుపల నాకు వ్యక్తిగత జీవితం ఉంది" అని బదులిచ్చాడు. ప్రతి శనివారం తాను క్రికెట్ ఆడతానని, 14 ఏళ్ల వయసు నుంచే గిటార్ వాయిస్తున్నానని, అలాగే కుటుంబంతో సమయం గడపడం కూడా తనకు ముఖ్యమని వివరించాడు.

ఈ పనులను ఆదివారం లేదా కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా చేసుకోవచ్చు కదా అని అభిషేక్ సూచించగా, ఆ యువకుడు అమెరికా పని సంస్కృతిని ఉదహరించాడు. "మా సోదరుడు అమెరికాలో పనిచేస్తాడు. అక్కడ వారంతా సోమవారం నుంచి శుక్రవారం వరకే విధులకు హాజరవుతారు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంంగా ఉన్న వారు ఐదు రోజులు పనితో విజయవంతం కాగలిగినప్పుడు, మనం ఎందుకు కాలేము?" అని ఎదురు ప్రశ్నించాడు.

సాధారణంగా ఇంటర్వ్యూలకు వచ్చేవారు యజమానులు ఏం వినాలనుకుంటారో అదే చెబుతారని, కానీ ఈ యువకుడిలోని నిజాయతీ, ఆలోచనా దృక్పథం తనను ఆకట్టుకున్నాయని అభిషేక్ తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో అతడికి ఉద్యోగం ఇచ్చారు. అనూహ్యంగా, ఆ ఉద్యోగి వరుసగా రెండు త్రైమాసికాల్లో తన బృందంలో అందరికంటే మెరుగైన ఫలితాలు సాధించాడు. "ప్రారంభంలో నేను అతడిని సోమరి అనుకున్నాను. కానీ ఆ ఏడాది నేను కలిసిన వ్యక్తుల్లో అత్యంత స్పష్టత ఉన్న వ్యక్తి అతడేనని తర్వాత అర్థమైంది" అని అభిషేక్ ముగించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Abhishek AgarwalGen Z employeeWork life balanceDelhi businessmanFive day work weekEmployee productivity

More Telugu News

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధర్నా

13 Nov, 10:54

భవనం మధ్యలోంచి దూసుకెళ్లనున్న మెట్రో రైలు.. చెన్నైలో వినూత్న ప్రాజెక్ట్

13 Nov, 10:50

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ

13 Nov, 10:47

నెల్లూరు, వైజాగ్, తిరుపతిలో కొత్త స్టార్ హోటళ్లు: మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

13 Nov, 10:45

హైదరాబాద్‌లో 4 పీఆర్‌టీఎస్ కారిడార్లు.. ఏడాదిలోనే తొలిదశ పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

13 Nov, 10:24

ఖవాజాను బలిపశువును చేశాడు.. కమిన్స్‌పై వార్నర్ ఫైర్!

13 Nov, 10:21

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అరుదైన గౌరవం

13 Nov, 10:18

'నేనొక పనికిమాలిన వాడిని'.. రాజీనామా స‌మ‌యంలో కుంగిపోయిన జెన్సన్ హువాంగ్!

13 Nov, 10:01

రెండేళ్లలో భారత్‌లోనే సొంతంగా విమానాల తయారీ: రామ్మోహన్‌ నాయుడు

13 Nov, 09:46

చేతిలోని నగదు బ్యాగ్‌ లాక్కెళ్లిన కోతి.. చెట్టుపై నుంచి డబ్బుల వర్షం.. ఇదిగో వీడియో!

13 Nov, 09:29

'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. 6 వేల‌కు పైగా వీసాల రద్దు

13 Nov, 09:09

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లి గోడను ఢీకొన్న కారు

13 Nov, 08:55

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు.. లక్షలాది మంది యూజర్లకు చుక్కలు!

13 Nov, 08:47

తెలంగాణలో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ!

13 Nov, 08:35

ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఎంఓయూ

13 Nov, 08:18
..More Telugu News