రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజుకు దొరకని ఊరట
- రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి అప్పలరాజుకు బెయిల్ నిరాకరణ
- ఆయన బెయిల్ పిటిషన్‌ను రెండోసారి తిరస్కరించిన సోంపేట కోర్టు
- సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై అరెస్ట్
- ప్రస్తుతం శ్రీకాకుళం అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్న అప్పలరాజు
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడం ఇది రెండోసారి.
గత నెల 31న కూడా అప్పలరాజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. తాజాగా మరోసారి బెయిల్ నిరాకరించడంతో ఆయన జైలులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేసు నేపథ్యం: గత నెల 10న అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందారు. అయితే, ఈ కేసు నుంచి తన కుమారుడిని రక్షించేందుకు అప్పలరాజు సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను ఈ కేసులో ఏ3 నిందితుడిగా చేర్చారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే పలాస కోర్టు ఆయన రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం అప్పలరాజు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో ఉన్నారు.