తనపై వస్తున్న ఆర్ఎస్ఎస్ ముద్రపై మాధవన్ స్పందన

R Madhavan response to RSS label and social media trolls
  • నెటిజన్ల కామెంట్లకు తాను ప్రభావితం కానన్న మాధవన్
  • పీఎం, సీఎంలను ప్రశంసించడం తన బాధ్యత అని వ్యాఖ్య
  • 'ధురంధర్'ను ప్రచార చిత్రంగా అభివర్ణించడంపై ఆగ్రహం

సోషల్ మీడియాలో తనపై వస్తున్న 'సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)' ముద్రపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ అత్యంత స్పష్టతతో స్పందించారు. నెటిజన్లు చేసే కామెంట్లకు తాను ప్రభావితం కానని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని లేదా ముఖ్యమంత్రులు మంచి పనులు చేస్తే ప్రశంసించడం ఒక పౌరుడిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... తాను ఏ రాజకీయ పార్టీకీ వ్యతిరేకం కాదని, కేవలం మంచి పనులకే మద్దతు ఇస్తానని తెలిపారు. సోషల్ మీడియా ట్రోల్స్ తన సొంత ఆలోచనలను మార్చలేవని స్పష్టం చేశారు.


ఇదే సమయంలో, ‘ధురంధర్’ సినిమాను ఒక ప్రచార (Propaganda) చిత్రంగా అభివర్ణించడంపై కూడా మాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జాతీయ భద్రత, పాకిస్థాన్ నేపథ్యంలో సాగే ఈ కథ ఒక నేషనల్ సెక్యూరిటీ డ్రామా మాత్రమేనని వివరించారు. దేశ విజయాలను, ప్రాముఖ్యతను వెండితెరపై ప్రపంచానికి చూపించడాన్ని తప్పుగా చూడకూడదని, విమర్శల కోసం నిజాలను దాచడం తమ నైజం కాదని తేల్చి చెప్పారు.

Advertisement
R Madhavan
RSS
Dhurandhar movie
National Security Drama
Social Media Trolls
Indian Cinema

More Telugu News