‘బీయింగ్ హ్యూమన్’ ఫ్రాడ్ కేసు: సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు
- చండీగఢ్ కోర్టులో సల్మాన్ ఖాన్‌పై ఫ్రాడ్ కేసు
- బీయింగ్ హ్యూమన్ నగల షోరూమ్ విషయంలో మోసం ఆరోపణలు
- రూ.3 కోట్లు నష్టపోయానంటూ వ్యాపారి ఫిర్యాదు
- అక్టోబర్ 5న హాజరు కావాలని సల్మాన్, ఆయన సోదరికి ఆదేశం
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్‌కు సంబంధించిన ఒక మోసం కేసులో న్యాయస్థానం ఈ సమన్లు పంపింది. అక్టోబర్ 5వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని వారిని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఈ ఫిర్యాదు చేశారు. చండీగఢ్‌లోని మణిమజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు తనకు హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. వారి మాటలు నమ్మి, షోరూమ్ అభివృద్ధి కోసం కోటి రూపాయలతో పాటు మొత్తం 3 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
ఒప్పందంలోని అన్ని షరతులను తాను నెరవేర్చినప్పటికీ, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి వ్యాపార సహకారం అందలేదని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 2020 నుంచి నగల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా షోరూమ్ మూసివేయాల్సి రావడంతో తనకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఆరోపణలను గతంలోనే సదరు కంపెనీ ఖండించింది. 2018లో అరుణ్ గుప్తాతో జరిగిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సల్మాన్ ఖాన్, ఆయన సోదరితో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగనుంది.