కొత్త రంగుల్లో ఐఫోన్ 18 ప్రో.. పెదవి విరుస్తున్న అభిమానులు!

iPhone 18 Pro in new colors fans express disappointment over leaked details
  • మరో రెండు నెలల్లో మార్కెట్లోకి  యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్
  • కెమెరా బంప్ పెరగడం లేదా ఫోన్ మందం సుమారు 2 మి.మీ. పెరిగే అవకాశం
  • గతం కంటే బరువు పెరగనున్న ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు
  • వినియోగదారులకు అత్యంత ప్రియమైన బ్లాక్ రంగు వేరియంట్ రాకపోవచ్చని అంచనా
  • డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, సిల్వర్ రంగుల్లో మాత్రమే లభించే అవకాశం
ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ త్వరలోనే విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై రకరకాల వార్తలు టెక్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరులో అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి లీకైన కొన్ని వివరాలు వినియోగదారులను కొంతవరకు అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి ఫోన్ మందం, బరువు, అందుబాటులో ఉండే రంగుల విషయంలో పలు ఊహాగానాలు బయటకు వచ్చాయి.

లీకైన వివరాల ప్రకారం.. నయా ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో కంటే దాదాపు 2 మిమీ వరకు ఎక్కువ మందంతో ఉండే అవకాశముంది. ప్రముఖ టిప్‌స్టర్ల కథనం ప్రకారం ఈ ఫోన్‌ల మందం 10.75 మిమీ వరకు పెరగవచ్చు. అయితే, కొన్ని నివేదికలు కేవలం బ్యాక్ కెమెరా బంప్ పరిమాణం పెరగడం వల్లే ఈ వ్యత్యాసం కనిపిస్తుందని, ఫోన్ ప్రధాన బాడీ మందం 8.75 మిమీ మాత్రమే ఉంటుందని పేర్కొంటున్నాయి.

మరో ప్రధాన మార్పు ఫోన్ బరువులో కనిపిస్తోంది. కొత్త ప్రో మ్యాక్స్ మోడల్ బరువు 240 గ్రాములకు చేరవచ్చని అంచనా. ఇది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (233 గ్రాములు) కంటే ఏడు గ్రామాలు ఎక్కువ. ఇప్పటికే చేతిలో పట్టుకోవడానికి బరువుగా ఉన్నాయనే విమర్శలు ఉండగా, కొత్త వెర్షన్ మరికొంత బరువు పెరగడం పట్ల వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా, యాపిల్ ఐఫోన్ ప్రో సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బ్లాక్'కలర్ వేరియంట్‌ను ఈసారి నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి బదులుగా డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, సిల్వర్ రంగులలో మాత్రమే ఈ ఫోన్ లభించనుందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇవే వార్తలు నిజమైతే, సన్నగా, తేలికగా ఉండే నలుపు రంగు ఐఫోన్ కోరుకునే వినియోగదారులకు ఇది కొంత ప్రతికూల వార్తగానే భావించవచ్చు. అయితే, యాపిల్ సంస్థ అధికారికంగా వెల్లడించే వరకు ఈ లీక్స్‌ను కేవలం అంచనాలుగానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
iPhone 18 Pro
Apple iPhone 18 leaks
iPhone 18 Pro colors
iPhone 18 Pro Max weight
Apple flagship smartphones
iPhone 18 Pro design news

More Telugu News