ఉక్రెయిన్‌లో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులతో సహా పలువురు మృతి
- ఉక్రెయిన్‌లోని ఒడెస్సా సమీపంలో పౌర నౌకపై క్షిపణి దాడి
- ధాన్యం లోడుతో వెళుతున్న పౌర కార్గో నౌక లక్ష్యంగా దాడి
- దాడిలో మరో భారతీయుడికి తీవ్ర గాయాలు
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో పెను విషాదం చోటుచేసుకుంది. ధాన్యంతో వెళుతున్న ఒక పౌర కార్గో నౌకపై క్షిపణి దాడి చేయడంతో, నలుగురు భారతీయులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. నల్ల సముద్రంలో పౌర నౌకల భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. కాగా, ఈ క్షిపణి దాడి చేసింది రష్యానే అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
టర్కీకి చెందిన, గినియా-బిస్సావ్ పతాకంతో ప్రయాణిస్తున్న 'గోల్డెన్ లియో' అనే బల్క్ క్యారియర్ నౌక, జూలై 19న ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడికి గురైంది. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. సహాయక బృందాలు కొందరిని రక్షించి ఒడెస్సాలోని ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనలో ఉక్రెయిన్ పైలట్‌తో పాటు మరికొందరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నౌకలో మొత్తం ఐదుగురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వారిలో నలుగురు దుర్మరణం పాలవ్వగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది.
"ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను తమ బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని, బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, నౌకాయానం మరియు వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం అత్యంత విచారకరం. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.