ఎల్‌ఐసీ వద్ద రూ.7,400 కోట్ల అన్‌క్లెయిమ్డ్ నిధులు.. మీ డబ్బు ఉందేమో చూసుకోండి!
- ఈ నిధులను పాలసీదారులకే అందిస్తామని స్పష్టం చేసిన కేంద్రం
- సరైన వివరాలు లేకపోవడం, అవగాహన లోపమే ప్రధాన కారణం
- చిన్న మొత్తాలను జమ చేసే పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) వద్ద సుమారు రూ.7,400 కోట్ల మేర క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాలసీదారులకు లేదా వారి నామినీలకు చేరాల్సిన ఈ భారీ మొత్తం.. అవగాహన లోపం, చిరునామాలు మారడం, రికార్డుల్లో వివరాలు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల పేరుకుపోయినట్లు తెలిపింది.
క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు రూ.5,564.5 కోట్లు కాగా, వాటిపై వచ్చిన ఆదాయం రూ.1,754 కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. పాలసీ మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్‌లు, సర్వైవల్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలను గడువు ముగిసిన 12 నెలల తర్వాత కూడా తీసుకోని పక్షంలో, వాటిని 'అన్‌క్లెయిమ్డ్ నిధులు'గా పరిగణిస్తారు.
ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ఉద్దేశం లేదని, అర్హులైన క్లెయిమ్ దారులకు వాటిని తిరిగి అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు, చిన్న మొత్తాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు.. ఆధార్‌తో అనుసంధానమైన లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1,000 వరకు నిధులను నేరుగా జమ చేసే పైలట్ ప్రాజెక్టును ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. నిద్రాణంగా ఉన్న చిన్న మొత్తాల సంఖ్యను తగ్గించడం, అర్హులైన ఖాతాదారులకు ఆ నిధులను సత్వరం బదిలీ చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.