వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఇంకా పర్యవేక్షణ.. ఆసుపత్రి బులెటిన్‌లో కీలక వివరాలు
- 21 రోజుల దీక్ష తర్వాత ఆసుపత్రిలో వాంగ్‌చుక్
- ఆరోగ్యం నిలకడ.. రక్త పరీక్షల్లో కొన్ని మార్పులు
- ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వైద్యుల పర్యవేక్షణ
- డిశ్ఛార్జి చేయాలని కోరిన భార్య
- చికిత్సపై పారదర్శకత లేదని ఆరోపణ
21 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆసుపత్రిలో చేరిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పర్యవేక్షణ మాత్రం కొనసాగుతోందని వెల్లడించారు. బయటకు ఆయన సాధారణంగానే కనిపిస్తున్నా.. దీర్ఘకాలం ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో దుష్పరిణామాలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆయన్ను నిపుణుల బృందం నిరంతరం గమనిస్తోందన్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
ఢిల్లీలోని వీఎంఎంసీ-సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ఆదివారం విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రాణాధార సూచీలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. అయితే రక్త పరీక్షల్లో కొన్ని విలువలు ఇంకా సాధారణ స్థాయికి చేరలేదని వివరించింది. దీర్ఘకాల నిరాహార దీక్ష శరీరంలోని పలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని, అందుకే నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొంది.
సఫ్దర్‌జంగ్ వైద్యులతో పాటు ఎయిమ్స్ నిపుణులు కూడా వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన పరిస్థితిని గంట గంటకూ అంచనా వేస్తూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించకపోయినా, దీక్ష ప్రభావం ఒక్కసారిగా బయటపడే అవకాశం ఉండటంతో వైద్య బృందం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది.
ఇదిలా ఉండగా చికిత్సపై పారదర్శకత లేదంటూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె. ఆంగ్మో ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. తమ కుటుంబం ఎంపిక చేసిన వైద్య కేంద్రానికి తరలించేందుకు వీలుగా వీలైనంత త్వరగా డిశ్చార్జి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ అభ్యర్థనపై ఆసుపత్రి నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా వాంగ్‌చుక్ జూన్ 28న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 21 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనల మేరకు శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడున్న ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. జూన్ 6 నుంచి కొనసాగుతున్న ఈ నిరసనలో నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.