ఫిఫా ఫైనల్‌ జోష్‌.. విద్యార్థులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

FIFA World Cup Final Kerala schools and colleges closed on Monday
  • ఫిఫా ఫైనల్‌కు కేరళలో సెలవు
  • అన్ని విద్యాసంస్థలకు వర్తింపు
  • అర్ధరాత్రి మ్యాచ్‌ దృష్ట్యా నిర్ణయం
  • పరీక్షలు మాత్రం యథాతథం
  • అర్జెంటీనా-స్పెయిన్‌ ఫైనల్‌ పోరు
ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ సందడి కేరళలో ప్రత్యేక నిర్ణయానికి దారి తీసింది. అర్ధరాత్రి జరిగే తుది పోరును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రొఫెషనల్‌ కాలేజీలు కూడా సోమవారం మూసివేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే ముందుగానే షెడ్యూల్‌ చేసిన పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ అర్ధరాత్రి తర్వాత ముగియనున్నందున మరుసటి రోజు ఉదయం విద్యార్థులు తరగతులకు హాజరుకావడం కష్టమవుతుందని ఇటీవల మాజీ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి అభిప్రాయపడ్డారు. అదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2026 ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా, స్పెయిన్‌ జట్లు తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఫుట్‌బాల్‌పై అపారమైన అభిమానమున్న కేరళలో మాత్రం ఫైనల్‌ కోసం ఏకంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం విశేషం. 
Advertisement
Kerala Government
FIFA World Cup Final
Argentina vs Spain
School Holiday Kerala
VD Satheesan
Football Fans Kerala

More Telugu News