తిరుమలలో గదుల కేటాయింపు ఇక సులభతరం.. టీటీడీ కొత్త విధానం పూర్తి వివరాలు
- తిరుమలలో వసతి గదుల కోసం టీటీడీ కొత్త విధానం
- సీఆర్వోలో రిజిస్ట్రేషన్, ఉప విచారణ కార్యాలయాల్లో కేటాయింపు
- డిస్ప్లే బోర్డులు, ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు సమాచారం
- గదుల కేటాయింపు, ఖాళీ చేయడంపై కఠిన నిబంధనలు
- ఆన్‌లైన్‌లోనే రుసుము చెల్లింపు తప్పనిసరి
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులు వసతి గదుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానమ్స్) స్వస్తి పలికింది. గదుల కోసం కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, సులభతరమైన, ఆధునిక సాంకేతికతతో కూడిన నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా ఉప విచారణ కార్యాలయాల ద్వారా భక్తులకు వేగంగా గదులను కేటాయిస్తూ వారి సమయాన్ని, శ్రమను ఆదా చేస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
వసతి గది కావాలనుకునే భక్తులు ముందుగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గదులు అందుబాటులో ఉన్నంత వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. క్యూలైన్‌లో తమ వంతు వచ్చిన తర్వాత, భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ కాపీతో పాటు, ఫోన్ నంబర్‌ను అక్కడి కౌంటర్‌లో అందించాలి. అనంతరం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ సమయంలో భక్తులు తమకు కావాల్సిన గది కేటగిరీని ఎంచుకోవచ్చు.
A కేటగిరీ: రూ.50, రూ.100 అద్దె గల గదులు ఉంటాయి. B కేటగిరీ: రూ.1000 అద్దె గల గదులు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రక్రియ పూర్తి కాగానే, రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్లు నిర్ధారిస్తూ భక్తులకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్ల వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసింది.
గది కేటాయింపు సమాచారం
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, భక్తులు సీఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ ప్లే బోర్డులను గమనిస్తూ ఉండాలి. రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్యల వారీగా గదులు కేటాయించబడుతున్న సమాచారం ఈ బోర్డులపై కనిపిస్తుంది. తమ రిజిస్ట్రేషన్ నంబర్ డిస్ ప్లే అయిన 15 నిమిషాల్లోపే, వారు నమోదు చేసిన ఫోన్ నంబర్‌కు గది కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.
ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోయినా, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఆర్వో వద్ద ఉన్న కియోస్క్ మెషీన్లలో తమ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను స్కాన్ చేయడం ద్వారా గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయం వివరాలు తెలుసుకోవచ్చు.
ఉప విచారణ కార్యాలయంలో చెల్లింపు
ఎస్ఎంఎస్ లేదా కియోస్క్ ద్వారా సమాచారం అందిన తర్వాత, భక్తులు నేరుగా తమకు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ గది అద్దె రుసుమును తప్పనిసరిగా ఆన్‌లైన్ పద్ధతిలో (ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డు) మాత్రమే చెల్లించాలి. నగదు చెల్లింపులకు అవకాశం లేదు. రుసుము చెల్లించిన వెంటనే వారికి గది తాళాలు అందజేస్తారు.
తిరుమలలోని ప్రధాన ఉప విచారణ కార్యాలయాలు
అంజనాద్రి నగర్ కాటేజస్ (ANC) శేషాద్రి నగర్ కాటేజస్ (SNC) శంఖుమిట్ట కాటేజస్ (SMC) గరుడాద్రి నగర్ కాటేజస్ (GNC) సుదర్శన, గోవర్ధన్, కల్యాణి సత్రాలు సప్తగిరి, రామ్ భగీచా, వరాహ స్వామి విశ్రాంతి గృహాలు కౌస్తుభం, పాంచజన్యం, నందకం విశ్రాంతి గృహాలు
భక్తులు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు
గది పొందడానికి భక్తుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒంటరి వ్యక్తులకు, అవివాహితులకు గదులు కేటాయించరు. ఒకసారి గది పొందిన వ్యక్తి, తిరిగి 30 రోజుల వరకు మరో గదిని పొందలేరు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ క్యూలో నిలబడాలి.
గదులు 24 గంటల కాలానికి మాత్రమే కేటాయిస్తారు. గడువు దాటితే 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం అదనపు రుసుము వసూలు చేస్తారు. గదిని పొందిన భక్తుడే స్వయంగా ఖాళీ చేయాలి, లేదంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు. తమకు కేటాయించిన గదిని ఇతరులకు ఇవ్వడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.