రామాయణం సినిమా కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయాణం: రకుల్‌

Ramayana is not just a movie but a journey to introduce India to the world
  • ‘రామాయణం’పై రకుల్‌ భావోద్వేగ పోస్ట్‌
  • శూర్పణఖ పాత్రలో రకుల్‌
  • రాముడిగా రణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి
  • రావణుడిగా యశ్‌
  • రెండు భాగాలుగా విడుదల
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో భాగం కావడం తనకు గర్వకారణమని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్కొంది. ఇది కేవలం ఓ సినిమా కాదని, భారత చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప ప్రయాణమని చెప్పింది. ఈ చిత్రంతో ప్రేక్షకులు ఓ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలిపింది.

ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘రామాయణం’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ఇంత భారీ స్థాయి చిత్రంలో భాగం కావడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా అభివర్ణించింది. భారత్‌కు ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తున్న భావన మాటల్లో చెప్పలేనిదని తన పోస్టులో పేర్కొంది.

నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. రావణాసురుడి సోదరిగా కథలో కీలక పాత్ర పోషించనున్న ఆమె లుక్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయనున్నారు. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Advertisement
Rakul Preet Singh
Ramayana Movie
Nitesh Tiwari
Ranbir Kapoor
Sai Pallavi
Shurpanakha

More Telugu News