'ఇథనాల్ కలిపిన పెట్రోల్' పై సీనియర్ నటుడు నరేశ్ సంచలన ట్వీట్

Senior actor Naresh sensational tweet on ethanol blended petrol
  • ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న నరేశ్
  • తన స్నేహితుడి కారుకు వాల్వ్స్ మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని వెల్లడి
  • తాను లీటరు రూ.165 పెట్టి హై-ఆక్టేన్ పెట్రోల్ వాడుతున్నానని వివరణ
  • ఈ విధానం బీజేపీకి రెడ్ సిగ్నల్ లాంటిదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక
  • బ్రెజిల్ తరహాలో దశలవారీగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) విధానంపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల సామాన్యుల నుంచి ఖరీదైన కార్లు వాడే వారి వరకు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని, వాహనాల ఇంజిన్లకు ఇది ‘గుండెపోటు’లా పరిణమించిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

"నేను దేశ వ్యతిరేకిని కాదు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానం బైక్ వినియోగదారుల నుంచి ఖరీదైన కార్లు వాడే వారి వరకు అందరికీ గుండెపోటు తెప్పిస్తోంది. బీజేపీకి బలమైన సానుభూతిపరుడైన నా స్నేహితుడు ఇటీవల టయోటా క్యామ్రీ కారు కొన్నాడు. ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల దాని ఇంజిన్ వాల్వులు దెబ్బతిన్నాయి. వాటిని మార్చడానికి అతనికి రూ.3.5 లక్షలు ఖర్చయింది.

ఇదే పరిస్థితి నేను కొత్తగా కొన్న పోర్షే పనమెరా కారుకు వస్తే, సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నష్టం భరించలేక, నేను ఇప్పుడు లీటరు రూ.165 చొప్పున విక్రయించే హై-ఆక్టేన్ 100 పెట్రోల్‌ను వాడాల్సి వస్తోంది. నా పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యులు, బైక్‌లు వాడే వారి సంగతేంటి? ఇది నిజంగా ఒక పీడకల.

ఒక బీజేపీ మాజీ నాయకుడిగా నాకు తెలుసు, పార్టీకి బలమైన థింక్ ట్యాంక్ ఉంది. ప్లాన్-ఎ, బి, సి అంటూ పక్కాగా ముందుకెళతారు. కానీ పర్యావరణాన్ని కాపాడటం కోసం కోట్లాది మంది ప్రజల జేబులకు చిల్లు పెట్టే ఈ నిర్ణయం చాలా హడావుడిగా, తీవ్రంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది.
వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. గత ఎన్నికల ఫలితాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడమే ఒక సంకేతం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇథనాల్ విధానం బీజేపీకి కచ్చితంగా ఒక రెడ్ సిగ్నల్. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు దశలవారీగా ఇథనాల్‌ను అమలు చేసి విజయం సాధించాయి. మన ప్రభుత్వం ఎందుకు ఇంత తొందరపడుతోంది? ఇదే నా ఆందోళన. కేవలం చెబుతున్నానంతే" అంటూ నరేశ్ ట్వీట్ చేశారు. 
Advertisement
Naresh
Ethanol blended petrol
E20 fuel engine damage
BJP ethanol policy
Porsche Panamera
Naresh tweet on petrol

More Telugu News