మేజర్ లీగ్ క్రికెట్ విజేత ఎల్ఏ నైట్ రైడర్స్... షారుఖ్ ఖాన్ ఆనందం
- అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్
- ఫైనల్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయం
- ఇది నైట్ రైడర్స్‌కు తొలి మేజర్ లీగ్ క్రికెట్ ఛాంపియన్‌షిప్
- జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సహ యజమానిగా ఉన్న లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ (LAKR) జట్టు మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో చరిత్ర సృష్టించింది. ఆదివారం ఓక్‌లాండ్ కొలీజియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జట్టు యాజమాన్యంతో పాటు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఏకేఆర్ జట్టు సునీల్ నరైన్, జాసన్ హోల్డర్ కీలక ఇన్నింగ్స్‌లతో 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ గట్టిగా పోరాడింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ ను షాడ్లీ అద్భుతంగా వేయడంతో వాషింగ్టన్ 163 పరుగులకే పరిమితమైంది. దీంతో నైట్ రైడర్స్ జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుపై షారుక్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పాల్గొనడానికే కాదు, గెలవడానికే వచ్చామని జట్టు నిరూపించిందని ప్రశంసించారు. సునీల్ నరైన్, జాసన్ హోల్డర్, రస్సెల్‌తో పాటు జట్టు సభ్యులందరినీ అభినందించారు. "మీరు అద్భుతంగా ఆడారు. లవ్ యూ ఆల్. కోర్బో లోర్బో జీత్బో" అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించాలనే తన దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా షారుక్ ఇటీవలే లాస్ ఏంజెలెస్‌లో ‘నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్’ను కూడా ప్రారంభించారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనున్న నేపథ్యంలో ఈ విజయం అమెరికాలో ఆటకు మరింత ఊపునిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.