జాతీయ అవార్డుల విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

Chiranjeevi congratulates National Film Awards winners
  • 72వ జాతీయ అవార్డుల విజేతలకు చిరంజీవి అభినందనలు
  • ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'కమిటీ కుర్రోళ్ళు' టీమ్‌కు ప్రశంసలు
  • నిహారికను చూసి గర్వపడుతున్నానన్న మెగాస్టార్
  • మమ్ముట్టి, సుకుమార్, నాగ్ అశ్విన్‌లను ప్రత్యేకంగా అభినందించిన చిరు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆయన, ప్రతి విజేతకు తన శుభాకాంక్షలు అందజేశారు. ముఖ్యంగా, ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్ర బృందాన్ని అభినందిస్తూ, ఆ సినిమా నిర్మాత, తన సోదరుడి కుమార్తె నిహారిక కొణిదెలను చూసి ఎంతో గర్వపడుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

అలాగే 'పుష్ప 2' చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డు గెలుచుకున్న సుకుమార్‌కు, 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి గాను ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైనందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్‌ బృందానికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. "నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన నా ఆప్తమిత్రుడు మమ్ముట్టికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది అసాధారణ విజయం" అని చిరంజీవి కొనియాడారు.

'లక్కీ భాస్కర్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచిన వెంకీ అట్లూరిని, '35' చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికవడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అదే చిత్రంలో తన ప్రతిభకు గాను ఉత్తమ బాలనటుడిగా అవార్డు గెలుచుకున్న అరుణ్ దేవ్‌ను కూడా ఆయన అభినందించారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, భారతీయ సినిమా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని, తరతరాలకు స్ఫూర్తినివ్వాలని చిరంజీవి ఆకాంక్షించారు.
Advertisement
Chiranjeevi
72nd National Film Awards
Mammootty
Sukumar Pushpa 2
Niharika Konidela Committee Kurrollu
Kalki 2898 AD Nag Ashwin

More Telugu News