మాజీ ప్రధాని దేవెగౌడ భార్య చెన్నమ్మ కన్నుమూత
- బెంగళూరు ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస
- శ్వాసకోశ సమస్యతో బుధవారం ఆసుపత్రిలో చేరిన చెన్నమ్మ
- మృతి చెందిన సమయంలో ఆసుపత్రిలోనే దేవేగౌడ, కుమారస్వామి
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య చెన్నమ్మ (80) శనివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తీవ్ర గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.
శ్వాసకోశ సంబంధిత సమస్యల కారణంగా చెన్నమ్మ బుధవారం రాత్రి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపించినప్పటికీ, శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో ఆమె భర్త దేవెగౌడ, కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
1954లో దేవెగౌడతో చెన్నమ్మ వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణ సుపరిచితులు.
తన భర్త ఎమ్మెల్యే స్థాయి నుంచి దేశ ప్రధాని పీఠం అధిరోహించినా, చెన్నమ్మ మాత్రం ఎప్పుడూ రాజకీయాలకు, ప్రచారానికి దూరంగా ఉంటూ నిరాడంబర జీవితాన్నే గడిపారు. హసన్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె, తన పూర్తి సమయాన్ని కుటుంబ బాధ్యతలకే అంకితం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఆమె అందించిన అండదండలు, త్యాగాల గురించి దేవేగౌడ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు.
2001లో హసన్‌లోని తమ స్వగ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన యాసిడ్ దాడి నుంచి ఆమె తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చెన్నమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.