ప్రజలకు ఒకే రోజున రూ.3 వేల కోట్లను అందించాం: పయ్యావుల కేశవ్
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ అస్తవ్యస్తం చేసిందన్న పయ్యావుల
- మోదీ, నిర్మలా సీతారామన్ ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని వెల్లడి
- రాష్ట్రం కోసం ఏమి అడిగినా నిర్మల ఇస్తున్నారని కితాబు
ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే రోజున రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అందించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నరసరావుపేటలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను వైసీపీ అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బు లేని పరిస్థితి ఉండేదని అన్నారు.
ప్రధాని మోదీ ఆశీస్సులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనలతో ఏపీ ఇప్పుడు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. ఒక మహిళ ఇంటిని ఎలా తీర్చిదిద్దుతుందో అంతకంటే మెరుగ్గా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ‘2024లో మీరు వేసిన ఒక్క ఓటు వల్లే ఏపీకి అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, తల్లికి వందనం, ఉచిత బస్సు, గూగుల్ వంటి కంపెనీల రాక సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చారు. ఏపీకి ఏ కష్టం వచ్చినా నిర్మలా సీతారామన్ ఇంటి తలుపు తట్టి సాయం అడుగుతున్నామని, రాష్ట్రం కోసం ఏం అడిగినా కాదనకుండా కేంద్ర మంత్రి పనిచేస్తున్నారని తెలిపారు.
విశాఖలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నిర్మలమ్మ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీయే ప్రభుత్వం రేయింబవళ్లూ రాష్ట్రం కోసం పనిచేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మహిళలు, యువతకు భారీగా రుణాలు అందిస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్లకు బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. అటవీ సాగుహక్కు పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రుణాలు అందిస్తున్నామని చెప్పారు.