నరసరావుపేటలో బ్యాంకుల రుణ మేళా.. హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు
- నరసరావుపేటలో క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం
- పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మల
- వివిధ రంగాల లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేసిన నేతలు
- యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభం
- ఈ కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లను అందజేసిన చంద్రబాబు, నిర్మల
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేసిన 'క్రెడిట్ అవుట్‌రీచ్' కార్యక్రమంలో వీరిద్దరూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికగా వివిధ రంగాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమకూర్చిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం, బాలికలకు సైకిళ్లను అందజేసి వారిని ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆమెకు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు కలిసి నరసరావుపేట పర్యటనకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.