70 ఏళ్ల చరిత్రలో గోదావరికి ఇంత తక్కువ ఇన్‌ఫ్లో ఇదే తొలిసారి: నిమ్మల రామానాయుడు
- ధవళేశ్వరం నుంచి బైక్‌పై ప్రయాణించిన నిమ్మల
- గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి కొనసాగిన పర్యటన
- నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బైక్‌పై ప్రయాణించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లాకుల నీటిమట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి నల్ల లాకులను తనిఖీ చేశారు.
70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్‌ఫ్లో రావడం ఇదే మొదటిసారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 70 శాతం కాలువలు, 30 శాతం వర్షాలపై ఆధారపడి డిజైన్ చేసిన డెల్టాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పర్యటన ద్వారా స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.