భారత్‌లో వన్‌ప్లస్ ఫోన్లు ఇక కనిపించవా?
- ఒప్పో పునర్వ్యవస్థీకరణలో వన్‌ప్లస్‌పై ఆసక్తికర వార్తలు
- ముందుగా అమెరికా, యూరప్‌లో కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం
- భారత్ నుంచి 2027లో తప్పుకునే ఛాన్స్
- అమ్మకాల మందగమనం, చిప్ ధరల పెరుగుదలే ప్రధాన కారణాలు
- రియల్‌మీ కూడా చైనా మార్కెట్ నుంచి నిష్క్రమించే అవకాశం
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల మధ్య వన్‌ప్లస్ భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. కంపెనీ కార్యకలాపాలపై గతంలోనూ పలు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తాజా నివేదిక మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా, యూరప్‌తో పాటు భారత్‌లో కూడా వన్‌ప్లస్ కార్యకలాపాలు నిలిచిపోవచ్చన్న సమాచారం చర్చనీయాంశంగా మారింది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఒప్పో చేపట్టనున్న గ్లోబల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వన్‌ప్లస్ కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అమెరికా, యూరప్‌లో కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. 2027లో భారత్ నుంచీ వైదొలగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వృద్ధి మందగించడం ఒప్పో నిర్ణయానికి ప్రధాన కారణంగా నివేదిక వెల్లడించింది. అమెరికా, యూరప్, భారత్‌లో వ్యాపార వేగం తగ్గడం, డీఆర్‌ఏఎమ్, మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, అమెరికాలో భౌగోళిక రాజకీయ పరిణామాలు, యాపిల్‌తో కొనసాగుతున్న న్యాయ వివాదం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలిపింది.
ఇదే పునర్వ్యవస్థీకరణలో భాగంగా రియల్‌మీ కూడా చైనా మార్కెట్ నుంచి వైదొలగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు ఒప్పో మాత్రం చైనా మార్కెట్‌పై దృష్టి కొనసాగించడంతో పాటు మధ్య యూరప్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. స్వీడన్, ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్ వంటి నార్డిక్ దేశాల్లో రియల్‌మీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్ నిష్క్రమించే అవకాశాల గురించే వార్తలు వచ్చాయి. అయితే భారత్‌ను కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో చేర్చనున్నట్లు పేర్కొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ ఇండియా సీఈఓ పదవి నుంచి రాబిన్ లియూ తప్పుకోవడం, సంస్థ స్థానిక యాజమాన్యంలో మార్పులు చేపట్టడం కూడా ఈ పరిణామాల్లో భాగంగానే భావిస్తున్నారు.