యుద్ధభూమిలో ప్రభాస్.. ‘ఫౌజీ’ విడుదల తేదీ వచ్చేసింది!
- ‘ఫౌజీ’ చిత్రం 2026 డిసెంబర్ 3న విడుదల
- రిలీజ్ డేట్‌తో పాటు ప్రభాస్ కొత్త పోస్టర్ విడుదల
- యుద్ధభూమి మధ్య ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్
- సోషల్ మీడియాలో లుక్ వైరల్
ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఒక పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. యుద్ధభూమి నేపథ్యాన్ని చూపించిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిత్ర బృందం ప్రకటించిన వివరాల ప్రకారం ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న విడుదల కానుంది. ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, నిర్ణయించిన తేదీకే సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త పోస్టర్‌లో ప్రభాస్ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించారు. వర్షంలో తడిసిపోయి, రక్తపు మరకలతో, గాయాలతో యుద్ధభూమి మధ్య కూర్చున్న ఆయన చేతిలో తుపాకీ కనిపిస్తోంది. చుట్టూ మృతదేహాలు, శిథిలాలు కనిపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ‘ఒంటరిగా పోరాడే ఓ బెటాలియన్’ అనే ట్యాగ్‌లైన్‌తో కథ యుద్ధం, త్యాగం, ధైర్యం చుట్టూ తిరగబోతుందనే సంకేతాలు ఇచ్చారు.
పోస్టర్‌లో ‘ఫౌజీ’ టైటిల్‌ను ఎరుపు రంగులో ప్రత్యేకంగా చూపించారు. చారిత్రక నేపథ్యాన్ని సూచించేలా పాత ముద్రలు, సంఖ్యలు, చేతిరాత తరహా డిజైన్‌లను ఉపయోగించారు. దీంతో సినిమా ఏ కాలంలో సాగుతుందనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.
ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌తో ఆయన చేస్తున్న తొలి సినిమా ఇదే. ఇమాన్వీ, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ పోస్టుకు కొన్ని నిమిషాల్లోనే వేలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ప్రభాస్ కొత్త అవతారం, సినిమా నిర్మాణ స్థాయిపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.