యుద్ధ ప్రభావం.. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై సుంకం పెంచిన కేంద్రం
- డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ రూ.15.50కు పెంపు
- రూ.14.50కు పెరిగిన ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకం
- పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రూ.2.50కు తగ్గింపు
- కొత్త పన్ను రేట్లు నేటి నుంచే అమల్లోకి
- ముడి చమురు ధరల పెరుగుదలతో కేంద్రం నిర్ణయం
- రిఫైనింగ్ మార్జిన్ల మార్పులను బట్టి పన్ను సవరణ
ప్రపంచ చమురు మార్కెట్‌లో పెరుగుతున్న ఒడిదుడుకుల ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్రం మరోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు చేసింది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై పన్ను పెంచుతూ కొత్త రేట్లను అమల్లోకి తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. డీజిల్‌పై లీటరుకు రూ.8.50గా ఉన్న ఎగుమతి సుంకాన్ని రూ.15.50కు సవరించింది. లీటరు ఏటీఎఫ్‌పై రూ.7.50గా ఉన్న పన్నును రూ.14.50కు పెంచింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.4గా ఉన్న సుంకాన్ని రూ.2.50కు తగ్గించింది.
ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీనివల్ల రిఫైనింగ్ మార్జిన్లు పెరగడంతో కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో తాజా మార్పులు చేసింది.
దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం నిర్దిష్ట వ్యవధుల్లో సమీక్షిస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రిఫైనింగ్ మార్జిన్లలో వచ్చే మార్పులను బట్టి పన్ను రేట్లను సవరిస్తూ ఉంటుంది.