ముద్రగడ పాడె మోసిన జగన్

Mudragada Padmanabham funeral YS Jagan pays final tributes
  • ప్రారంభమైన ముద్రగడ అంత్యక్రియలు
  • ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముద్రగడ పాడెను జగన్, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మోశారు.
Advertisement
Mudragada Padmanabham
YS Jagan Mohan Reddy
Botsa Satyanarayana
Mudragada Padmanabham Funeral
Kapu Leader Mudragada
YSRCP News

More Telugu News