మహిళా నేతపై వ్యాఖ్యల వివాదం.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు
- రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- మహిళా నేతపై వ్యాఖ్యల ఆడియో వైరల్
- శివచరణ్‌రెడ్డిని తొలగించాలని బీసీ సంఘాల డిమాండ్
- రూ.7 కోట్ల వ్యాఖ్యలతో మరో ఆడియో కూడా వైరల్
- రెండు వ్యవహారాల నేపథ్యంలో నోటీసులు జారీ
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా నేతపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా స్పందించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎల్‌బీనగర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే దాంట్లో తన తండ్రి ప్రభాకర్‌రెడ్డి ఫొటో లేకపోవడంపై శివచరణ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్ం చేశారు. ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్‌కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశాయి. శివచరణ్‌రెడ్డిని యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు శివచరణ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రూ.7 కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్లు మరో ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఈ రెండు వ్యవహారాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.