అంతరిక్షంలోకి భారత సంతతి వైద్యుడు.. తొలి యాత్ర ప్రారంభించిన అనిల్ మీనన్
- రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్‌లో కజకిస్థాన్ నుంచి విజయవంతంగా ప్రయోగం
- ఐఎస్ఎస్‌లో 8 నెలల పాటు ఉండి కీలక శాస్త్రీయ పరిశోధనలు
- స్పేస్‌ఎక్స్ తొలి ఫ్లైట్ సర్జన్‌గా పనిచేసిన అనుభవం
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి, యూఎస్ స్పేస్ ఫోర్స్ కల్నల్ అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యాకు చెందిన సోయుజ్ MS-29 వ్యోమనౌకలో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనమయ్యారు. మంగళవారం కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు.
అనిల్ మీనన్‌తో పాటు రష్యాకు చెందిన కాస్మోనాట్లు ప్యోతర్ డబ్రోవ్, అన్నా కికినా కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు. ప్రయోగం జరిగిన కొద్ది గంటల్లోనే వారి వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంలోని ‘ప్రిచల్’ మాడ్యూల్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. అనిల్ మీనన్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయాణం కాగా, మిగిలిన ఇద్దరికీ ఇది రెండో యాత్ర. ఈ బృందం ఇప్పటికే ఐఎస్ఎస్‌లో ఉన్న ఎక్స్‌పెడిషన్ 74/75 సిబ్బందితో కలవనుంది.
దాదాపు ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడపనున్న అనిల్ మీనన్, 2027 ఏప్రిల్‌లో భూమికి తిరిగి వస్తారు. ఈ సుదీర్ఘ యాత్రలో ఆయన పలు కీలక శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు. ముఖ్యంగా అంతరిక్షంలో సెమీకండక్టర్ క్రిస్టల్స్ ఉత్పత్తి, ఏఐ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన అల్ట్రాసౌండ్ టెక్నిక్స్, బయోప్రింటింగ్ వంటి అంశాలపై విస్తృత ప్రయోగాలు నిర్వహించనున్నారు.
భారత, ఉక్రెయిన్ వలసదారుల సంతతికి చెందిన అనిల్ మీనన్, 2021లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. అంతకుముందు ఆయన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ఎక్స్’కు తొలి ఫ్లైట్ సర్జన్‌గా సేవలందించారు.