విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పనితీరు పెంచే 3 బ్రెయిన్ ట్రిక్స్
- మల్టీటాస్కింగ్ నేర్చుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడి
- నిరంతర సాధనతో మెదడు కొత్త విధానానికి అలవాటు పడుతుందని గుర్తింపు
- ఒక పనిని పూర్తిగా అలవాటు చేసుకున్న తర్వాతే మరో పనిని జోడించాలని సూచన
- రోజూ ఒకే అలవాటును కొనసాగిస్తే మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం
- విద్యార్థులు, ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకుల అభిప్రాయం
ఉద్యోగం, చదువు లేదా రోజువారీ జీవితంలో ఒకేసారి ఎన్నో పనులు పూర్తి చేయాలనే లక్ష్యం చాలా మందికి ఉంటుంది. అయితే ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందనే అభిప్రాయం ఇప్పటి వరకు ఉండేది. కానీ తాజాగా ‘జర్నల్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్’లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయంలో కొత్త విషయాలను వెల్లడించింది. సరైన శిక్షణ, నిరంతర సాధనతో మెదడును మల్టీటాస్కింగ్‌కు అలవాటు చేయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
30 వేల మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో 5 నుంచి 10 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత వారి మెదడును స్కాన్ చేయగా నాడీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. పదేపదే సాధన చేసిన పనులు క్రమంగా ఆటోమేటిక్‌గా మారిపోయాయని, వాటిని చేయడానికి అదనపు మానసిక శ్రమ అవసరం లేకుండా పోయిందని పరిశోధకులు తెలిపారు.
పరిశోధన ప్రకారం ప్రారంభంలో కొత్త పనులను నేర్చుకునే సమయంలో మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువగా పనిచేస్తుంది. అయితే అదే పనిని మళ్లీ మళ్లీ సాధన చేయడంతో ఆ బాధ్యత క్రమంగా టెంపోరల్ కార్టెక్స్‌కు మారుతుంది. దీంతో ఆ పని సహజంగా చేసే అలవాటు ఏర్పడి, ఒకేసారి ఇతర పనులపై కూడా దృష్టి పెట్టే అవకాశం పెరుగుతుంది.
ఈ అధ్యయనంలో మల్టీటాస్కింగ్‌కు ఉపయోగపడే మూడు ముఖ్యమైన పద్ధతులను పరిశోధకులు సూచించారు.
మొదటిది.. ఒక పనిని పూర్తిగా అలవాటుగా మారే వరకు పదేపదే చేయడం. డ్రైవింగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, ప్రతిరోజూ ఒకే మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గాన్ని మెదడు గుర్తుంచుకుని తర్వాత పెద్దగా ఆలోచించకుండా డ్రైవ్ చేయగలుగుతుందని వివరించారు.
రెండో పద్ధతి.. చిన్న చిన్న అలవాట్లను నిరంతరం కొనసాగించడం. ఒకే పనిని రోజూ చేయడం వల్ల మెదడులోని న్యూరల్ మార్గాలు బలపడతాయని, తర్వాత అదే పనిని మరింత క్లిష్టంగా చేసినా మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది.
మూడో పద్ధతి.. ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం సాధించిన తర్వాతే మరో పనిని దానికి జోడించాలని పరిశోధకులు సూచించారు. ఒకేసారి అనేక కొత్త పనులను మెదడుపై మోపకుండా, క్రమంగా వాటి సంఖ్యను పెంచడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.
ఈ పద్ధతులు విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగపడతాయని అధ్యయనం పేర్కొంది. వీటి ద్వారా ఉత్పాదకత పెరగడం, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడం, మానసిక అలసట తగ్గడం, రోజువారీ పనులను వేగంగా పూర్తి చేసే సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.
అయితే అన్ని పనులను ఒకేసారి చేయడం సాధ్యం కాదని కూడా వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ మెసేజ్‌లు పంపడం వంటి పనులు ప్రమాదకరమని హెచ్చరించారు. ఒకే సమయంలో పూర్తి దృష్టి అవసరమయ్యే పనులను కలిపి చేయకూడదని సూచించారు.
పెద్దవారిలో కూడా మెదడు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కొనసాగుతుందని, సరైన సాధనతో జీవితాంతం మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే ఏయే పనులను కలిపి చేయవచ్చు, శిక్షణ వ్యవధి వంటి అంశాలపై ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.