పలాస యాక్సిడెంట్ కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు
- వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ లొంగుబాటు
- పలాసలో జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో కాపరి మృతి
- తొలుత స్నేహితుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నం
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరవ్‌ను గుర్తించిన పోలీసులు
- న్యాయవాదులతో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అరవ్
శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన న్యాయవాదులతో కలిసి అతడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, జూలై 10వ తేదీ రాత్రి పలాస పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అరవ్ అతివేగంతో నడుపుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఢీకొని, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దానయ్య (45) అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అరవ్‌ను కొందరు వ్యక్తులు ఒక కారులో అక్కడి నుంచి తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు తొలుత అరవ్ స్నేహితుడు సిద్ధార్థ్ తానే ప్రమాదానికి కారణమని పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని పెట్రోల్ బంక్‌లో అరవ్ ఒంటరిగా బైక్‌లో పెట్రోల్ నింపుతున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. దీంతో అసలు నిందితుడు అరవ్ అని నిర్ధారించుకున్నారు.
ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండటంతో అరవ్ లొంగిపోక తప్పలేదు. కాగా, కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.