‘‘నాకిద్దరు కూతుళ్లు ఉన్నారు.. ఉద్యోగం ఇవ్వండి’’.. తండ్రి కష్టాలను గుర్తుచేసుకున్న భాగ్యశ్రీ బోర్సే
- తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కష్టాల్లో పెరిగానన్న భాగ్యశ్రీ బోర్సే
- ప్రతి రూపాయికి లెక్క వేసుకుంటూ కుటుంబం గడిచేదని వెల్లడి
- తల్లిదండ్రుల కోసమే విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని వ్యాఖ్య
- ‘లెనిన్’ సక్సెస్ తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న నటి
‘లెనిన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే. తాజాగా చిన్ననాటి జీవితంలోని కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. తాను పుట్టిన వెంటనే తండ్రి ఉద్యోగం కోల్పోయారని, ఆ తర్వాత కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమని, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డారో కళ్లారా చూశానని తెలిపింది.
ఇంట్లో ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేసేవారని భాగ్యశ్రీ చెప్పింది. రూ.10 పచ్చిమిర్చి, రూ.10 పాలకూర కొనుగోలు చేసిన వివరాలనూ నోట్‌బుక్‌లో రాసుకునేవారని, ఒక వారం రూ.300 ఖర్చయితే తర్వాతి వారం ఎలా గడపాలా అని తల్లిదండ్రులు ఆలోచించేవారని గుర్తు చేసుకుంది. చిన్నతనంలో డబ్బు విలువ తెలియకపోయినా, పెరిగేకొద్దీ తల్లిదండ్రుల కష్టాలు అర్థమయ్యాయని వివరించింది.
తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని ఓ సంఘటనను భాగ్యశ్రీ గుర్తు చేసుకుంది. ‘‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి’’ అంటూ తన తండ్రి ఒకరి వద్ద వేడుకున్నారని తెలిపింది. చిన్న వయసులో తండ్రిని ఆ స్థితిలో చూడటం చాలా బాధ కలిగించిందని చెప్పింది. అప్పుడే ఆయన మళ్లీ ఎప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నానని, జీవితంలో తాను సాధించాలనుకున్న ప్రతి లక్ష్యం వెనుక తల్లిదండ్రులే ప్రేరణగా ఉన్నారని వెల్లడించింది.
ఔరంగాబాద్‌కు చెందిన భాగ్యశ్రీ బోర్సే కొంతకాలం నైజీరియాలో చదువుకుని, తర్వాత ముంబైలో మోడలింగ్ ప్రారంభించింది. బాలీవుడ్‌లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమెకు రవితేజ సరసన నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని వంటి హీరోలతో నటించింది. ఇటీవల అఖిల్ అక్కినేని సరసన నటించిన ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.