సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
- వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
- గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు
- సీఎం రేవంత్‌రెడ్డిపై టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలే కారణమని సమాచారం
- రేవంత్‌ను "జొమాటో డెలివరీ బాయ్" అంటూ తీవ్ర విమర్శలు
- ముందస్తు నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు ఆదివారం గుంటూరుకు చేరుకున్నారు. నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అనంతరం, తమ వివరాలను, అరెస్ట్ సమాచారాన్ని స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తెలియజేస్తామని చెప్పి ఆయన్ను తమతో తీసుకెళ్లారు. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతను, మరో రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది..
ఇటీవల ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని 'జొమాటో డెలివరీ బాయ్' అని సంబోధిస్తూ, ఆయన జీవోలను కూడా సరిగా చదవరని ఆరోపించారు. ఎమ్మెల్యేగా కూడా రేవంత్ సమర్థంగా పనిచేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆయనపై కేసు నమోదై, అరెస్ట్ జరిగిట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ కూడా నిర్ధారించింది.