విశాఖకు జగన్.. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న వైసీపీ అధినేత
- ఈ నెల 14న విశాఖకు వెళ్లనున్న జగన్
- బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ
- ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ నేతలు
- సీఎం, డిప్యూటీ సీఎం మౌనంపై వైసీపీ విమర్శలు
- ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుడితోనూ జగన్ భేటీ
వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నెల 14వ తేదీన జగన్ పర్యటన ఖరారైంది.
ఈ పర్యటన వివరాలను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆదివారం వెల్లడించారు. జూలై 14న ఉదయం 10:30 గంటలకు జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా దక్షిణ నియోజకవర్గంలోని జబ్బరుపేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చుతారని తెలిపారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కరి చిన్నాతో పాటు అతని కుటుంబ సభ్యులతోనూ జగన్ మాట్లాడతారని చెప్పారు.
ఈ సందర్భంగా కేకే రాజు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం జరిగినా, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరడానికి 20 గంటల సమయం పట్టిందని ఆరోపించారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసు, మత్స్య, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని అన్నారు.
గల్లంతైన వారి ఆచూకీ లభించకముందే రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. జిల్లాకు చెందిన హోం మంత్రి అనిత బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు ఈ విషాదంపై మౌనంగా ఉన్నారంటూ విమర్శించారు.
జూలై 4న గంగవరం తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఏడుగురు మత్స్యకారులతో వెళ్లిన మర పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఆరుగురి ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల పాటు నేవీ, కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఆపరేషన్ను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం గల్లంతైన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.