రెనో ట్రైబర్‌పై రూ.60,000 వరకు డిస్కౌంట్
- ఈ ఆఫర్ పరిమిత కాలానికేనన్న కంపెనీ
- రాష్ట్రానికి బట్టి మారుతున్న డిస్కౌంట్లు
- కేరళలో గరిష్ఠంగా రూ.60 వేల డిస్కౌంట్
- గుజరాత్‌లో రూ.45 వేల తగ్గింపు
- మిగిలిన రాష్ట్రాల్లో గరిష్ఠంగా రూ.30 వేల రాయితీ
- క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ, రిఫరల్, కార్పొరేట్ డిస్కౌంట్లు
రెనో ఇండియా తన ట్రైబర్ ఎంపీవీపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. పరిమిత కాలానికి అందుబాటులో ఉండే ఈ ఆఫర్లలో భాగంగా, జులై నెలలో గరిష్ఠంగా రూ.60 వేల వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. అయితే రాష్ట్రం, వేరియంట్, మోడల్ ఇయర్, వినియోగదారుడి అర్హతను బట్టి డిస్కౌంట్ మొత్తం మారుతుందని కంపెనీ తెలిపింది.
రెనో అధికారిక వివరాల ప్రకారం.. కేరళలో ట్రైబర్‌పై రూ.60 వేల వరకు, గుజరాత్‌లో రూ.45 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర చాలా రాష్ట్రాల్లో గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ, రిఫరల్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉండొచ్చు.
రెనో ట్రైబర్ ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ.5.81 లక్షల నుంచి రూ.8.48 లక్షల వరకు ఉంది. ఏడు సీట్ల సదుపాయం ఉండి, అత్యంత అందుబాటు ధరల్లో వస్తున్న బాగా చవక ఎంపీవీల్లో ఇదొకటి. ఇందులో 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉండగా, 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్తాయి. మాన్యువల్ వేరియంట్‌కు లీటర్‌కు 20 కిలోమీటర్ల వరకు, ఏఎంటీ వేరియంట్‌కు 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఉందని కంపెనీ పేర్కొంది.
వేరియంట్‌ను బట్టి ట్రైబర్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ కెమెరా వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది.