పాప్‌కార్న్ ఎందుకు పేలుతుంది? మీకు ఇష్టమైన స్నాక్ వెనుక దాగిన సైన్స్ ఇదే!
- పాప్‌కార్న్ గింజల్లో కొద్దిపాటి నీరు ఉంటుంది
- వేడి వల్ల నీరు ఆవిరిగా మారుతుంది
- ఆవిరి ఒత్తిడితో గింజ పేలిపోతుంది
- పిండి పదార్థం విస్తరించి తెల్లగా మారుతుంది
- కొన్ని గింజలు తేమ లేక పేలవు
సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో మూవీ చూస్తున్నా చాలామంది చేతిలో కనిపించే స్నాక్ పాప్‌కార్న్. చిన్న మొక్కజొన్న గింజ క్షణాల్లో తెల్లగా, మెత్తగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు పాప్‌కార్న్ ఎందుకు పేలుతుంది? ప్రతి గింజ ఎందుకు ఒకేలా పాప్ అవదు? దీనికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను నిపుణులు వివరించారు.
గింజలో నీరు
పాప్‌కార్న్ గింజ బయటకు పూర్తిగా పొడిగా కనిపిస్తుంది. కానీ దాని లోపల కొద్దిపాటి నీరు ఉంటుంది. అదే పాప్‌కార్న్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ మొక్కజొన్న గింజలతో పోలిస్తే పాప్‌కార్న్ గింజల్లో తగినంత తేమతో పాటు బయటి పొర గట్టి ఉంటుంది. ఈ ప్రత్యేక నిర్మాణమే వేడి తట్టుకుని చివరికి గింజ పేలేలా చేస్తుంది.
ఆవిరి ఒత్తిడి
పాప్‌కార్న్‌ను వేడి చేయగానే గింజలోని నీరు క్రమంగా ఆవిరిగా మారుతుంది. అయితే గింజపై ఉండే గట్టి పొర కారణంగా ఆ ఆవిరి బయటకు వెళ్లలేదు. దీంతో గింజ లోపల ఒత్తిడి వేగంగా పెరుగుతుంది. ఈ ఒత్తిడి సాధారణ వాతావరణ పీడనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పేలే క్షణం
గింజ తట్టుకోలేని స్థాయికి ఒత్తిడి చేరుకున్న వెంటనే గట్టి పొర ఒక్కసారిగా పగిలిపోతుంది. అదే మనకు వినిపించే ‘పాప్’ శబ్దం. ఒత్తిడి ఒక్కసారిగా విడుదల కావడంతో లోపల ఉన్న పిండి పదార్థం వేగంగా ఉబ్బి విస్తరిస్తుంది. క్షణాల్లో చిన్న గింజ తెల్లగా, మెత్తగా కనిపించే పాప్‌కార్న్‌గా మారిపోతుంది.
తెల్ల భాగం ఏది?
చాలామంది పాప్‌కార్న్‌లో కనిపించే తెల్లని భాగం గింజ లోపలి భాగమే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. గింజలోని పిండి పదార్థం ఒక్కసారిగా విస్తరించి, చల్లబడే సమయంలో నురుగు లాంటి ఆకారాన్ని ఏర్పరుస్తుంది. అదే మనం తినే తెల్లని పాప్‌కార్న్‌గా మారుతుంది.
పేలని గింజలు
పాప్‌కార్న్ తయారు చేసిన తర్వాత కొన్ని గింజలు అలాగే మిగిలిపోతాయి. వీటిని ‘ఓల్డ్ మెయిడ్స్’ అని పిలుస్తారు. గింజలో తేమ తగ్గిపోవడం లేదా బయటి పొరలో చిన్న పగుళ్లు ఉండటం వల్ల అవసరమైన ఒత్తిడి ఏర్పడదు. అందుకే అలాంటి గింజలు పేలకుండా మిగిలిపోతాయి.
అన్ని గింజలు కావు
ప్రతి మొక్కజొన్న గింజ పాప్‌కార్న్‌గా మారదు. పాప్‌కార్న్ కోసం ప్రత్యేక రకానికి చెందిన మొక్కజొన్ననే ఉపయోగిస్తారు. వీటిలో గట్టి బయటి పొర, సరైన తేమ ఉంటాయి. స్వీట్ కార్న్, ఫీల్డ్ కార్న్లలో ఈ లక్షణాలు ఉండవు. అందుకే వాటిని వేడి చేసినా పాప్‌కార్న్‌లా పేలవు.