గుండెకు కూడా క్యాన్సర్ వస్తుందా? వైద్య నిపుణులు చెప్పిన నిజాలు!
- గుండెకు కూడా క్యాన్సర్ రావచ్చంటున్న నిపుణులు
- కాకపోతే చాలా అరుదని స్పష్టీకరణ
- పెద్దయ్యాక గుండె కణాలు విభజన చెందకపోవడమే కారణం
- గుండెలో కనిపించే చాలా కణితులు క్యాన్సర్ కాదంటున్న నిపుణులు
- అయినా ప్రాణాపాయం కలిగించొచ్చని హెచ్చరిక
గుండెకు కూడా క్యాన్సర్ వస్తుందా? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. అందుకు నిపుణులు సమాధానం ఇచ్చారు. గుండెకు కూడా క్యాన్సర్ వస్తుందని తెలిపారు. కానీ అది అత్యంత అరుదైన క్యాన్సర్లలో ఒకటని వెల్లడించారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం... గుండెలో ఏర్పడే కణితులను నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కణితులు క్యాన్సర్ కాకపోయినా.. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
గుండెకు క్యాన్సర్ ఎందుకు అరుదు?
క్యాన్సర్ అంటే శరీరంలోని కణాలు అదుపు తప్పి ఇబ్బడిముబ్బడిగా పెరగడం. అయితే గుండె కండరాల కణాలు పెద్దయ్యాక చాలా తక్కువగా విభజన చెందుతాయి. అందుకే గుండెలోనే కొత్తగా క్యాన్సర్ ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గుండెలో కనిపించే చాలా కణితులు క్యాన్సర్ కావు. కొన్ని ఇతర అవయవాల నుంచి వ్యాపించి గుండెకు చేరుతాయి.
క్యాన్సర్ కాకపోయినా ప్రమాదమే
గుండెలో ఎక్కువగా కనిపించే కణితిని ‘మైక్సోమా’ అంటారు. ఇది సాధారణంగా క్యాన్సర్ కాదు. అయినా దాని పరిమాణం, ఉన్న ప్రాంతాన్ని బట్టి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు కణితి నుంచి విడిపోయిన చిన్న భాగాలు రక్తంతో కలిసి మెదడు లేదా ఇతర అవయవాలకు చేరి స్ట్రోక్, అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తప్పడం, గుండె వైఫల్య లక్షణాలు, జ్వరం, తీవ్రమైన అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం కూడా కనిపించొచ్చు. ఇలాంటి కణితులను శస్త్రచికిత్సతో పూర్తిగా తొలగించే అవకాశం చాలా సందర్భాల్లో ఉంటుంది.
గుండెలో వచ్చే క్యాన్సర్లు ఏవి?
గుండెలోనే ప్రారంభమయ్యే క్యాన్సర్లు చాలా అరుదు. కానీ అవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి గుండె కండరాలు, కవాటాలు, గుండె స్పందనను నియంత్రించే వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా గుండె కొట్టుకునే తీరు మారడం, గుండె వైఫల్యం, రక్తప్రసరణలో ఆటంకం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఊపిరితిత్తులు, రొమ్ము, మూత్రపిండాలు లేదా రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు కొన్నిసార్లు గుండెకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
గుండెలో కణితులు ఉన్నా వాటి లక్షణాలు సాధారణ గుండె సమస్యల్లాగే ఉంటాయి. అందుకే గుర్తించడం కష్టమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తగ్గని ఛాతీనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, తరచూ స్పృహ తప్పడం, కాళ్లు వాపు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా గుర్తిస్తారు? చికిత్స ఏంటి?
గుండె అల్ట్రాసౌండ్, కార్డియాక్ ఎంఆర్‌ఐ, కార్డియాక్ సీటీ స్కాన్ వంటి పరీక్షలతో కణితి పరిమాణం, స్థానం, స్వభావాన్ని గుర్తిస్తారు. అవసరమైతే కణజాల నమూనాను కూడా పరీక్షిస్తారు. కణితి క్యాన్సర్ కాదంటే శస్త్రచికిత్సతో తొలగిస్తారు. క్యాన్సర్ అయితే సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరమవుతుంది. ఇతర అవయవాల నుంచి గుండెకు వ్యాపించిన క్యాన్సర్ అయితే అసలు క్యాన్సర్‌కే చికిత్స అందిస్తారు.
గుండె క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే ప్రత్యేక మార్గాలు లేవు. అయినా పొగాకు అలవాటుకు దూరంగా ఉండటం, రక్తపోటును నియంత్రణలో ఉంచడం, గుండెకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది.