వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్: స్పందన తెలిపేందుకు మెటాకు గడువు పొడిగింపు
- వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం ఆందోళన
- వివరణ ఇచ్చేందుకు మెటాకు జులై 9 వరకు గడువు పొడిగింపు
- సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వ భయం
- ప్రభుత్వ ఆందోళనలు తీరే వరకు ఫీచర్ తీసుకురాబోమని మెటా హామీ
వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలకు వివరణ ఇచ్చేందుకు మాతృసంస్థ మెటాకు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించారు. ఈ ఫీచర్ వల్ల పెరిగే సైబర్ నేరాల ముప్పుపై ప్రభుత్వ అధికారులతో మెటా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, స్పందన తెలియజేసేందుకు జూలై 9 వరకు సమయం ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఫోన్ నంబర్లతో సంబంధం లేకుండా ప్రత్యేక యూజర్‌నేమ్‌ల ద్వారా సందేశాలు పంపుకునేందుకు ఈ నూతన ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఇది వినియోగదారుల గోప్యతను మెరుగుపరిచినప్పటికీ, సైబర్ మోసాలు, ఫిషింగ్, ఫేక్ అరెస్టు స్కామ్‌లు, ఇతరుల పేర్లతో జరిగే మోసాలకు ఆస్కారం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం మెటాకు నోటీసులు జారీ చేసింది. భద్రతాపరమైన అంశాలను పూర్తిగా సమీక్షించే వరకు ఈ ఫీచర్ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ క్రమంలో గత శుక్రవారం నాడు ఐటీ శాఖ అధికారులతో మెటా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ అంశంపై పూర్తిస్థాయి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని వారు కోరడంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ప్రభుత్వ ఆందోళనలు పూర్తిగా నివృత్తి అయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టబోమని వాట్సాప్ ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదని, ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా తీసుకువస్తామని మెటా స్పష్టం చేసింది. ఖాతా రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబర్ తప్పనిసరి అని, వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే అనేక పటిష్ఠ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. దాదాపు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న భారత్‌లో డిజిటల్ భద్రతపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.