అఖిల్ 'లెనిన్' కోసం రంగంలోకి ఎన్టీఆర్
- అక్కినేని అఖిల్ హీరోగా 'లెనిన్'
- జులై 10న థియేటర్లలోకి చిత్రం
- వాయిస్ ఓవర్ అందించిన జూనియర్ ఎన్టీఆర్
- సినిమా ఆరంభంలో వచ్చే కీలక ఘట్టాలను పరిచయం చేయనున్న యంగ్ టైగర్
మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్... అఖిల్ అక్కినేని కొత్త చిత్రం 'లెనిన్'కు తన గంభీరమైన స్వరంతో అదనపు బలాన్ని చేకూర్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న 'లెనిన్' సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమా ఆరంభంలో వచ్చే కీలక ఘట్టాలను ఎన్టీఆర్ తన వాయిస్‌తో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
సినిమాలోని శ్రీరాంపురం, భారతం మిట్ట అనే రెండు ముఖ్యమైన ప్రాంతాల నేపథ్యాన్ని, వాటి ప్రాముఖ్యతను ఎన్టీఆర్ తన స్వరంతో వివరించనున్నారు. ఈ చిత్రానికి ఆయన వాయిస్ ఓవర్ మరింత బలాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. "పరిచయం అవసరం లేని స్వరంతో లెనిన్ ప్రపంచం పరిచయం కానుంది" అంటూ పోస్ట్ చేసి, దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది. జూలై 10న 'లెనిన్' చిత్రం థియేటర్లలోకి రానుంది.
'ఏజెంట్' సినిమా నిరాశపర్చిన తర్వాత అక్కినేని హీరో అఖిల్ సుదీర్ఘ విరామం తీసుకుని నటించిన చిత్రం 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలోకి వస్తోంది. పూర్తిస్థాయి రూరల్ యాక్షన్, లవ్, ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, సునీల్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా కథ పూర్తిగా రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగుతుంది. అక్కడి సంస్కృతిలో భాగమైన ద్రౌపదమ్మ కొలువులు, కుటుంబ వివాదాలు, పౌరాణిక అంశాలతో కూడిన ప్రేమకథగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. 'ఏజెంట్' తర్వాత ఎలాగైనా గట్టి విజయం సాధించాలనే పట్టుదలతో అఖిల్ ఈ సినిమా చేశాడు. ఇందులో అఖిల్ మాస్ లుక్, సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.