అమెరికా 250వ వేడుకలకు వాతావరణం దెబ్బ.. ట్రంప్ సభ రద్దు
- వాషింగ్టన్లో ట్రంప్ బహిరంగ సభ అర్ధాంతరంగా రద్దు
- వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
- ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రపంచ నేతలు
వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నేషనల్ గార్డ్ సిబ్బంది, ఇతర నిర్వాహకులు రంగంలోకి దిగి సభా ప్రాంగణంలో ఉన్న వేలాది మంది ప్రజలను తక్షణమే ఖాళీ చేయించారు. సమీపంలోని మ్యూజియంలు, ఫెడరల్ భవనాలు, భూగర్భ మెట్రో స్టేషన్లలో తలదాచుకోవాలని సూచించారు. దీంతో ట్రంప్ ప్రసంగానికి ముందే సీక్రెట్ సర్వీస్ భద్రతా తనిఖీలను నిలిపివేసింది. సైనిక విమానాల ప్రదర్శనలు కూడా రద్దయ్యాయి.
కేవలం వాషింగ్టన్లోనే కాకుండా అమెరికా తూర్పు తీరమంతటా ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం కనిపించింది. హార్ట్ఫోర్డ్, హారిస్బర్గ్ వంటి అనేక నగరాల్లో అధికారిక వేడుకలను రద్దు చేయడం లేదా వాటిల్లో మార్పులు చేయడం జరిగింది. ఈ చారిత్రాత్మక వేడుకలు దేశంలోని తీవ్ర రాజకీయ విభేదాల నడుమ జరిగాయి. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రసంగాలు ఒకవైపు, న్యూయార్క్ మేయర్ వంటి నేతలు భిన్నమైన గళం వినిపించడం మరోవైపు కనిపించింది.
ఒకవైపు ఆటంకాలు ఎదురైనప్పటికీ, న్యూయార్క్ హార్బర్లో చారిత్రాత్మక నౌకల ప్రదర్శన, ఫిలడెల్ఫియా, హ్యూస్టన్ నగరాల్లో బాణాసంచా కాల్పులతో ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ట్రంప్‌కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.