థియేటర్లలో రికార్డులు.. ఇక ఓటీటీలో 'పెద్ది' హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- ఓటీటీలోకి రాబోతున్న రామ్ చరణ్ 'పెద్ది'
- జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
- ఈ ఏడాది టాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన చిత్రం
- ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి రానుంది. దక్షిణాది భాషలకు ఐదు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో అలరించారు. శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ, జగపతి బాబు, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.