మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో అంగరంగ వైభవంగా టేలర్ స్విఫ్ట్ వివాహం
- టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్స్ వివాహం
- న్యూయార్క్‌లో అంగరంగ వైభవంగా వేడుక
- మ్యాడిసన్ స్క్వేర్‌లో భారీ స్క్రీన్లపై ప్రకటన
- మూడు సంవత్సరాల ప్రేమాయణానికి శుభం కార్డు
ఈ అద్భుతమైన వివాహ వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆడమ్ శాండ్లర్ ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి నడిపించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందే, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్‌విల్లేలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తమ పెళ్లి సందర్భంగా ఈ జంట అమెరికా వ్యాప్తంగా ఉన్న 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీగా విరాళాలు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
2023లో స్నేహంతో ప్రారంభమైన వీరి ప్రయాణం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2025 ఆగస్టు 26న ఇన్స్టాగ్రామ్ ద్వారా తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ జంట ప్రకటించింది. 14 సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న టేలర్ స్విఫ్ట్, మూడు సార్లు సూపర్ బౌల్ ఛాంపియన్‌గా నిలిచిన ట్రావిస్ కెల్స్ల వివాహంతో వీరి అభిమానుల కల నిజమైంది.