వీడియో: ఖమేనీ అంత్యక్రియలు.. కన్నీరుమున్నీరైన ఇరాన్ అగ్రనేతలు!
- ఖమేనీకి టెహ్రాన్‌లో ఘన నివాళులు
- కన్నీళ్లు పెట్టుకున్న గాలిబాఫ్, అరాఘ్చీ
- భారత్ తరఫున పబిత్ర మార్గెరిటా హాజరు
- జులై 9న మషద్‌లో అంతిమ సంస్కారాలు
- 2 కోట్ల మంది హాజరయ్యే అవకాశం
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇరాన్‌లో వారం రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. అంత్యక్రియల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత్ తరఫున కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ హాజరై సంతాపం తెలిపారు. అలాగే పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా నివాళులర్పించారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్, తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మోన్, రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సహా పలు దేశాల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అధికారుల అంచనా ప్రకారం 1.5 నుంచి 2 కోట్ల మంది వరకు ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం టెహ్రాన్‌లో అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం ఖోమ్, బాగ్దాద్, కర్బలా, నజఫ్ మీదుగా జులై 9న మషద్‌లో ఖమేనీకి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.