రెడ్‌బుల్, స్టింగ్ సహా 6 ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
- రెడ్‌బుల్, స్టింగ్ సహా 6 బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
- తప్పుడు బ్రాండింగ్, ప్రచారంపై అభ్యంతరం
- ‘ఎనర్జీ డ్రింక్’కు ప్రత్యేక ప్రమాణం లేదని స్పష్టం
- ఆరోగ్య ప్రయోజనాల ప్రకటనలు నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య
- వినియోగదారుల రక్షణకు తనిఖీలు మరింత కఠినతరం
ప్రస్తుతం ‘ఎనర్జీ డ్రింక్’ అనే పేరుతో ప్రత్యేక ఆహార ప్రమాణాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటించలేదని తెలిపింది. అయినప్పటికీ ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
అలాగే ‘శరీరానికి, మెదడుకు శక్తినిస్తుంది’, ‘ఏకాగ్రత పెంచుతుంది’, ‘ఎనర్జీని పెంచుతుంది’, ‘బలహీనతను తగ్గిస్తుంది’ వంటి ఆరోగ్య ప్రయోజనాల ప్రచారం కూడా ఆహార భద్రత చట్టాలకు విరుద్ధమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో తప్పుడు ప్రచారం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.