వైభవ్‌కు మరోసారి నిరాశ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Vaibhav disappointed once again as India win toss and choose to bat
  • చెస్టర్-లీ-స్ట్రీట్‌లో భారత్-ఇంగ్లండ్ తొలి టీ20
  • జట్టులోకి వరుణ్ చక్రవర్తి
  • ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్ సిరీస్‌లాగే ఈ మ్యాచ్‌లోనూ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐర్లాండ్‌ సిరీస్‌ను మర్చిపోయి కొత్త ఆరంభం చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. 

కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐర్లాండ్ సిరీస్‌కు దూరమైన వరుణ్‌కు ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ లభించింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు.

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
Shreyas Iyer
India vs England 1st T20
Vaibhav Suryavanshi
Varun Chakravarthy
India Playing XI
Harry Brook

More Telugu News