వెనక నుంచి అలాంటి ఫొటోలా?.. ఫొటోగ్రాఫర్లపై నేహా ధూపియా ఫైర్!
- పాపరాజీలపై నటి నేహా ధూపియా ఆగ్రహం
- వెనుక వైపు నుంచి ఫొటోలు తీయడంపై నిలదీత
- ముంబై ఈవెంట్‌లో నేరుగా హెచ్చరిక
- సెలబ్రిటీల ప్రైవసీపై మళ్లీ చర్చ
- మర్యాదగా నడుచుకోవాలని కెమెరామెన్లకు సూచన
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటి నేహా ధూపియా మీడియా ఫొటోగ్రాఫర్లపై (పాపరాజీలపై) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించకుండా, అసభ్యకరంగా వెనుక వైపు నుంచి (బ్యాక్ షాట్స్) ఫొటోలు, వీడియోలు తీస్తున్న కొందరు ఫొటోగ్రాఫర్లను ఆమె నేరుగా నిలదీశారు. ఈ ప్రవర్తన ఎంతమాత్రం సరికాదని, వెంటనే ఇలాంటి పనులు ఆపేయాలని కెమెరామెన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నేహా ధూపియా రన్నింగ్ ట్రాక్‌పై పరుగెడుతున్న సమయంలో కొందరు ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కెమెరామెన్ల అతి ప్రవర్తనపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవెంట్‌లో నేహా ధూపియా మాట్లాడుతూ.. "మీలో ఎవరు ఇంత అమర్యాదగా వెనుక నుంచి ఫొటోలు తీస్తున్నారు? మొదట అది ఆపేయండి! మేము మీకు పదే పదే ఈ విషయం చెప్పి విసిగిపోయాము. బ్యాగులు సద్దుకుంటున్నప్పుడు, పుస్తకాలు పట్టుకున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనుక నుంచి ఫొటోలు తీసే ఈ పద్ధతి ఇకపై సాగదు. వీటన్నింటికీ స్వస్తి చెప్పండి. మేము మీతో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాం, కాబట్టి మీరు కూడా అంతే మర్యాదగా నడుచుకోండి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సెలబ్రిటీల ప్రైవసీపై పెరిగిన చర్చ
నేహా ధూపియా చేసిన ఈ వ్యాఖ్యలతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, మీడియా ప్రవర్తనా నియమావళిపై (ఎథిక్స్) బాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది. పాపరాజీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మొదటి నటి నేహా ధూపియా మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో జాన్వీ కపూర్, అర్బాజ్ ఖాన్, సోనాక్షి సిన్హాలు కూడా ఇలాంటి అనుచితమైన ఫొటోగ్రఫీ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు ఒక ఆసుపత్రి వెలుపల తనను చుట్టుముట్టిన పాపరాజీల తీరుపై నటుడు సల్మాన్ ఖాన్ కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు.