రూ.20 వేలకే 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. వన్‌ప్లస్ కొత్త ఫోన్
- ప్రారంభ ధర రూ.22,999
- రూ.3,000 వరకు తగ్గింపు ఆఫర్లు
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్
- 8MP సెల్ఫీ కెమెరా
- జులై 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలు
వన్‌ప్లస్ N6 ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా రూ.1,000 ప్రత్యేక తగ్గింపుతో పాటు యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై మరో రూ.2,000 తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. జులై 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 1,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16తో ఫోన్ వస్తోంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. వేడి తగ్గించేందుకు పెద్ద వేపర్ చాంబర్ కూలింగ్ వ్యవస్థను కూడా అమర్చింది. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 1080పిక్సెల్స్ రిజల్యూషన్‌లో 60 ఎఫ్‌పీఎస్ వరకు వీడియోలు రికార్డ్ చేయవచ్చు. డ్యూయల్ వ్యూ వీడియో మోడ్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లోని 8,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6.5 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఐపీ65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.