వాళ్ల కోసమే పవన్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు: నాగబాబు
- గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికే పవన్ ఆ శాఖ తీసుకున్నాడని వెల్లడి
- అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామన్న నాగబాబు
- గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల రోడ్లు వేశామని వెల్లడి
- గిరిజన గ్రామాల్లో అదనపు మౌలిక వసతులు కల్పిస్తామన్న నాగబాబు
గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారని చెప్పారు. కురుడి, డుంబ్రిగూడ, బల్లగరువు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దబాడు వంటి గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పర్యటించి సమస్యలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు రూ.1,005 కోట్లతో సుమారు 1,069 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారని తెలిపారు. పీఎం జన్మన్ నిధుల నుంచి రూ.555 కోట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.2,525 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా రూ.50 కోట్లు కేటాయించి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
బాక్సైట్ మైనింగ్, హైడ్రో ప్రాజెక్టుల విషయంలో పర్యావరణం, గిరిజనుల జీవన విధానానికి ఎలాంటి హాని కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు.