గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం: అనిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం: అనిత

Vangalapudi Anitha says crackdown on ganja smugglers and assets seized
  • గంజాయి సాగును రికార్డు స్థాయిలో సున్నాకు చేర్చామన్న అనిత
  • దీని కారణంగా క్రైమ్ రేటు 14 శాతం తగ్గిందని వెల్లడి
  • ఈగిల్ వింగ్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కితాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును రికార్డు స్థాయిలో దాదాపు సున్నాకు చేర్చామని, దీని కారణంగా ఏపీలో నేరాల రేటు ఏకంగా 14 శాతం తగ్గిందని ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు.


రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటి వేళ్లతో పెకలించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వింగ్ ‘ఈగల్’ టాస్క్‌ఫోర్స్ క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని హోంమంత్రి కొనియాడారు. ఈ స్పెషల్ ఆపరేషన్ల ద్వారా ఇప్పటివరకు దాదాపు 1.20 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తిగా దహనం చేసినట్లు తెలిపారు. కేవలం మత్తు పదార్థాలను సీజ్ చేయడమే కాకుండా... అంతరాష్ట్ర స్మగ్లర్లకు చెందిన సుమారు రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసిందని వెల్లడించారు.

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపేలా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ఏరియాల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని, డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించడానికి ‘ఈగల్’ కొత్త వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని అనిత తెలిపారు.

Advertisement
Vangalapudi Anitha
Ganja smuggling Andhra Pradesh
Eagle Task Force AP
Drug free Andhra Pradesh
Ganja asset seizure
AP Home Minister News

More Telugu News