విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

Pawan Kalyan reacts to Visakhapatnam marine engineer Patnala Suresh death
  • అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి
  • ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన
  • మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
 పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ జరిగిన ఓ ఘోర ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఒమన్ తీరానికి సమీపంలో భారత నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో ఆయన మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దురదృష్టకర ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"భారత నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ గారు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో ఆయన మరణించారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం చాలా బాధాకరం. సురేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తున్నాను" అని పవన్ తన ప్రకటనలో తెలిపారు.
Go Back to Shorts
Patnala Suresh
Pawan Kalyan
Visakhapatnam marine engineer
US forces attack Indian ship
Oman coast tragedy
Andhra Pradesh Deputy CM

More Telugu News