పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా!
- హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర
- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల
- వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల
బుధవారం ఉదయం ట్రేడింగ్ వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,53,170కి చేరింది. మంగళవారం ముగింపు సమయానికి ఈ ధర రూ.1,53,160గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 మేర పెరిగి రూ.1,40,410 వద్ద నిలిచింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,880గా నమోదైంది.
మరోవైపు, వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 100 గ్రాముల వెండిపై రూ.10 తగ్గి రూ.26,990కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.100 మేర క్షీణించి రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది.