స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా?
- ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అయస్కాంత క్షేత్ర ప్రభావం
- స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో చిన్న అయస్కాంతాలు
- బయటి అయస్కాంతాలు తీసుకెళితే వాటిపై ప్రభావం
- ఓఐఎస్, ఆటోఫోకస్ ఫీచర్లు దెబ్బతినే అవకాశం
- ఫొటోల క్వాలిటీలో తేడా
ఎలాంటి ప్రభావం ఉంటుంది?
స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ‘ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్’, ‘ఆటోఫోకస్’ అనే రెండు కీలక ఫీచర్లు ఉంటాయి. మనం ఫొటోలు లేదా వీడియోలు తీస్తున్నప్పుడు చేతులు కొద్దిగా వణికినా, లేదా ఏదైనా కుదుపులు వచ్చినా ఫొటోలు బ్లర్ అవ్వకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది. ఇందుకోసం ఫోన్ లోపలే కొన్ని చిన్నపాటి అయస్కాంతాలు ఉంటాయి. ఇవి కెమెరా సెన్సార్, లెన్స్‌ల పొజిషన్‌ను రియల్ టైమ్‌లో అడ్జస్ట్ చేస్తుంటాయి. అలాగే ఆటోఫోకస్ ఫీచర్ కూడా ఫోన్ లోపలి అయస్కాంతాల సాయంతోనే గురుత్వాకర్షణ, వైబ్రేషన్స్‌ను లెక్కగట్టి కచ్చితమైన ఫోకస్‌ను ఇస్తుంది.
అయితే ఫోన్ లోపల ఉండే అయస్కాంతాల కంటే ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉండే ఏదైనా బయటి అయస్కాంతాన్ని కెమెరాకు దగ్గరగా ఉంచినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఆ అయస్కాంత క్షేత్రం వల్ల లోపల ఉండే కెమెరా సెన్సార్లు గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా ఓఐఎస్, ఆటోఫోకస్ సిస్టమ్‌లు సరిగా పనిచేయవు. దీనివల్ల ఫొటోలు చాలా మసకగా వస్తాయి. అలాగే కెమెరా దేనిపైనా సరిగా ఫోకస్ చేయలేదు.
ఈ నష్టం శాశ్వతంగా ఉంటుందా?
విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయస్కాంతాల వల్ల ఫోన్ కెమెరాకు ఎలాంటి శాశ్వత నష్టం వాటిల్లదు. అయస్కాంత క్షేత్రం నుంచి లేదా ఆ బలమైన అయస్కాంత వస్తువు నుంచి దూరంగా తీసుకువచ్చిన వెంటనే కెమెరా మళ్లీ యథావిధిగా పనిచేయడం ప్రారంభిస్తుంది.