వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్
- ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్
- వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు
- వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ
- రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 200 పరుగులు దాటించినా, ఫలితం లేకపోయింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో 15 ఏళ్ల వైభవ్ కంటతడి పెట్టాడు. అతడిని అలా చూసి తాను కూడా చాలా బాధపడ్డానని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మ్యాచ్ తర్వాత వైభవ్ ముఖం చూస్తే, అందులో తీవ్రమైన నిరాశ స్పష్టంగా కనిపించింది. అతను 15 ఏళ్ల చిన్న పిల్లాడు. కానీ అతని మనసులో ఎప్పుడూ జట్టును గెలిపించాలనే తపన ఉంటుంది" అని అశ్విన్ పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. "నిజం చెప్పాలంటే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏ దశలోనూ పోటీలో ఉన్నట్లు అనిపించలేదు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ త్వరగా ఔటయ్యారు. వైభవ్‌కు రవీంద్ర జడేజా, ఫెరీరా మాత్రమే కాస్త అండగా నిలిచారు. దాసున్ శనక 9 బంతుల్లో 3 పరుగులు చేశాడు. వైభవ్‌కు ఎవరూ సరైన సహకారం అందించలేదు" అని విమర్శించారు.
రాజస్థాన్ ఓటమికి, విజయానికి మధ్య వైభవ్ ఒక్కడే ఒంటరి యోధుడిలా నిలబడ్డాడని ప్రశంసించాడు. అతను చివరి వరకు అద్భుతంగా పోరాడాడని పేర్కొన్నాడు. కొన్ని ఓవర్ల పాటు అతనికి స్ట్రైక్ కూడా రాలేదని గుర్తు చేశాడు. "వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతం, అంతే" అంటూ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు.